![]() |
![]() |

గుప్పెడంత మనసు సీరియల్ లో దేవయానిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన నటి మిర్చీ మధవి. అందులో నెగెటివ్ రోల్ కి తనకి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి కాస్త బ్రేక్ తీసుకుంది. ఇక గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజ్య లావణ్యల ఇష్యూ మీద మాట్లాడిన మిర్చీ మధవి వారి అపార్ట్‌మెంట్ లో జరుగుతున్న ఘోరాలని బయటపెట్టింది.
తాజా ఇంటర్వ్యూలో మిర్చి మాధవి మాట్లాడుతూ.. డిస్ట్రబ్ చేసేవాళ్లకి కూడా తెలుసు. వీళ్లు పడతారా లేదా అని. ఇటు నుంచి రెస్పాన్స్ లేకపోతే హాయ్ అంటే హాయ్ అని వెళ్లిపోతారు. అలా కాకుండా.. హాయ్ అన్న తరువాత.. ఆహా అని.. అటు చూడటం ఇటు చూడటం.. అలా చేయడం ఇలా చేయడం లాంటివి చేస్తుంటే.. రా రా బాబూ అని డైరెక్ట్‌గా చెప్పడమే. మన పని మనం చేసుకుంటే ఎవరూ మన జోలికి రారు. కానీ వాళ్లు డిస్ట్రబ్ చేసినప్పుడు నువ్వు సిగ్నల్ ఇస్తే మాత్రం వాళ్లు ట్రై చేస్తుంటారు. మా అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. దానికి ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వీళ్లంతా రాత్రి పది దాటిన తరువాత కలిసి.. ఒక చోటికి వెళ్లిపోయి.. తెల్లారిన తరువాత వస్తుంటారు. ప్రతిరోజు ఇదే తంతు. గత మూడు నాలుగు నెలులుగా ఇదే జరుగుతుంది. కొన్ని రోజులకి బయట నుంచి ఎవరో వచ్చి.. ఆ అబ్బాయిల్ని చచ్చినట్టు కొట్టారు. తలలు పగలకొట్టారు. వాళ్లతో వెళ్లిన అమ్మాయిలు బాగానే ఉన్నారు. తప్పు చేసిందేమో అమ్మాయిలు కానీ శిక్ష మాత్రం అబ్బాయిలకు పడిందంటూ మిర్చీ మధవి అంది.
మన ఇంట్లోని పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చూస్తున్నారని గమనించుకోవాలని, కనడం కాదని.. వాళ్లని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలని అంది. సమాజానికి ఉపయోగపడతారో లేదో తరువాత సంగతి.. ముందు కన్న మీకు ఉపయోగపడతారో.. కనీసం వాళ్ల కోసం వాళ్లు ఉపయోగపడేలా అయిన పెంచుకోవాలి. మన ఫ్యామిలీ బాగుంటే.. సమాజం బాగున్నట్టే. ఎవరికి వాళ్లు సరిగ్గా ఉంటే ఇలాంటి ఘోరాలు జరగవు. షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించేయాలి.. సెక్స్.. బాయ్ ఫ్రెండ్.. డ్రగ్స్ ఇవన్నీ తాత్కాలికమే అంటు మిర్చీ మధవి చెప్పుకొచ్చింది.
![]() |
![]() |